- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రిన్సిపాల్ ఉంటే హాస్టల్‌లో అడుగుపెట్టం.. స్పష్టం చేసిన కస్తూర్బా బాలికలు
దిశ,మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆదివారం ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలు పాఠశాల బయట నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రిన్సిపాల్ మంగ తమ పట్ల అసభ్యకరమైన పదజాలంతో తిడుతుందని, తమతో బెంచీలు మోయిస్తుందని, ప్రిన్సిపల్ అండతో అటెండర్లు సైతం ప్రిన్సిపాల్ లాగా ఫోజులు కొడుతున్నారని ఆరోపించారు. వెంటనే ప్రిన్సిపాల్ ను హాస్టల్ వదిలేసి వెళ్లాల్సిందిగా విద్యార్థులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా హాస్టల్లో సరియైన పద్ధతిలో భోజనాలు వండటం లేదని, ఆయా శాస్త్రాలకు సంబంధించిన అధ్యాపకులను నియమించలేదని తద్వారా జరగాల్సిన తరగతులు జరగక సిలబస్ మిస్ అవుతున్నామని, ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న హాస్టల్ ప్రిన్సిపాల్ విధులలో ఉన్నంతవరకు తాము హాస్టల్ లోకి వెళ్లమని విద్యార్థులు స్పష్టం చేశారు.
హాస్టల్ కిందిస్థాయి సిబ్బందిని విద్యార్థులు మర్యాదపూర్వకమైన భాషతో పిలిస్తే వారి చేతులపై సాంబారు పోసే పైశాచికత్వానికి ఒడిగట్టారని విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. గత కొన్ని రోజుల క్రితం జిల్లాస్థాయి అధికారిని హాస్టల్ తనిఖీలో భాగంగా హాస్టల్ కు వచ్చి విద్యార్థుల బాగోగులు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా విద్యార్థులతో ముచ్చటించి వారికి అందుతున్నటువంటి సౌకర్యాలను అడిగి తెలుసుకుంటే, ప్రిన్సిపాల్ మంగ ఉదయం ప్రార్థన విభాగంలో విద్యార్థులను అమర్యాదగా పిలిచి బెదిరింపులతో భయాందోళనకు గురి చేసిందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రుల చొరవతో విద్యార్థినులు నిరసన విరమించారు.