- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Collectors : కొనేటప్పుడు కోట్లు.. మరమ్మత్తులకు తూట్లు..
దిశ, గాంధారి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి విద్యార్థికి సురక్షితమైన నీటిని అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, కస్తూర్బా ఇలా వివిధ ప్రతి ఒక్క ప్రభుత్వ ఆధీనంలో గల హాస్టల్ కు మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేశారు. అయితే ఒక్క కామారెడ్డి జిల్లాలోనే అనేక సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కస్తూర్బా, ఏకలవ్య మోడల్ స్కూల్, వంటి హాస్టల్ తో వాటికి ప్రభుత్వం వాటర్ ప్లాంట్లను కొనేటప్పుడు కోట్లలో ఖర్చు చేసిన మరమ్మతులకు మాత్రం తూట్లు పడేలా నేటి పరిస్థితి ఉంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంతకుముందు నాడు విధులు నిర్వహించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ కస్తూర్బాను సందర్శించి వాటర్ ప్లాంట్ ను బాగు చేయించాలని అప్పట్లో ఆదేశించడం జరిగింది.
దానికి అధికారులు వారం రోజుల్లో ఒక బాగు చేసేస్తాం సార్ అని ప్రగల్భాలు పలికి నేటికీ కొత్త కలెక్టర్ వచ్చిన ఎక్కడి వేసిన గొంగళి అక్కడనే అన్నట్టు వాటర్ ప్లాంట్ మాత్రం ఇంకా మరమ్మత్తులకు నోచుకోలేదు. నూతన పదవి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ కస్తూర్బా గాంధీలో మధ్యాహ్న భోజనం చేశారు. కలెక్టర్లు మారినా ఇంకా వాటర్ ప్లాంట్ మాత్రం మరమ్మతులు నోచుకోలేదు. నాడు కలెక్టర్గా ఉన్న జితేష్ వి.పాటిల్ మినరల్ వాటర్ గురించి వివరాలు తెలుసుకుని పాడైపోయిందని ప్రిన్సిపల్ తెలుపగా వెంటనే బాగుపరచాలని ఆదేశించారు. దీంతో సిబ్బంది బాగు చేయిస్తామని మొక్కుబడిగా సమాధానం ఇచ్చారు.
టైల్స్ వేసాం అందుకోసమే బాగు చేయించలేదు - ప్రిన్సిపల్ శిల్ప..
కస్తూర్బా గాంధీ విద్యాలయంలో టైల్స్ వేస్తున్నందున ఇంకా మినరల్ వాటర్ ప్లాంట్ ను బాగు చేయించలేదని మార్పిడికి అటు, ఇటు ఇబ్బందిగా ఉంటుందని అందుకోసమే టైల్స్ మొత్తం వేసిన తర్వాత అప్పుడు బాగు చేయిస్తామని వివరణ ఇవ్వడం కొసమెరుపు. ఇప్పటికి మాత్రం విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా బయట నుంచి మినరల్ వాటర్ తీసుకొస్తున్నామని సమాధానం ఇచ్చారు. అయితే వర్షాకాలం నీళ్ళు ఉంటుంది కానీ ఎండాకాలం మాత్రం బోర్ లో నీరు ఉండటం లేదని ఇది కూడా ఒక కారణమని ప్రిన్సిపల్ శిల్ప తెలిపారు.