- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతి సబ్ రిజిస్టార్ పై చర్యలు తీసుకోవాలి : జాయింట్ యాక్షన్ కమిటీ
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి ప్రజలను పట్టిపీడిస్తున్న అవినీతి అధికారి సబ్ రిజిస్టార్ శ్రీలత ను పారదోలే వరకు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని కామారెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొంది. గత కొన్ని రోజులుగా కామారెడ్డి సబ్ రిజిస్టర్ శ్రీలత అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటున్న తరుణంలో బాధితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గతంలో జరిగిన రిజిస్టర్ డాక్యుమెంట్లలో సబ్ రిజిస్టర్ వేధించిన పలుఅంశాలను బాధితులు తెలియజేశారు. ఇలాంటి అధికారి ఇక్కడ ఉద్యోగం నిర్వహిస్తుంటే రాబోయే రోజుల్లో కూడా ఎంతో మంది ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను, మానసిక వేదనను అనుభవించక తప్పదన్నారు.
పకడ్బందీగా ఒక ప్రణాళికతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రతిడాక్యుమెంట్ కు నానా రకాలుగా సాకు చూపుతూ, పెండింగ్ పెడుతూ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. ఇలా కేవలం డబ్బుల కోసమే ఈ అధికారి పనిచేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరును పలువురు విన్నవిస్తూ వాపోయారు. ఈ అవినీతి అధికారిపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని కామారెడ్డి నుండి బదిలీ చేయాలని కోరారు. లేనిచో రాబోవు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఈ అధికారి కామారెడ్డి నుండి పారదోలే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీని ప్రకటించారు. జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులుగా సీహెచ్ శ్రీనివాస్, రమేష్ గుప్తా, గంజి శ్రీనివాస్, హనుమంతు యాదవ్, మేహార్ బాబా గౌడ్, మహమ్మద్ సలీం, నిట్టు నారాయణరావు, బద్దం రాజు, భూమేష్ యాదవ్, మీర్ ఫారూఖ్ అలీ ఎన్నికయ్యారు.