జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో కాకతీయ హవా

by Naresh |
జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో కాకతీయ హవా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు హవా చాటారు. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతూ తొలి ప్రయత్నంలోనే ఉత్తమ ప్రతిభ కనబర్చడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ ఫలితాల్లో జిల్లా 1, 2, 3 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించారు. 17 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. ఇందులో 99.68 శాతం మార్కులతో ఎండీ మినహాజ్‌ తొలిస్థానం సాధించగా, 99.41 శాతంతో ఎం.సుప్రీత్‌ రెండో స్థానంలో నిలిచాడు. 99.22 శాతం మార్కులతో బి. శివప్రతం తృతీయ స్థానం కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా ఐఐటీ అడ్వాన్స్‌కి 50 మంది అర్హత సాధించారు. ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

కేవోఎస్‌తోనే ఉత్తమ ఫలితాలు : రామోజీరావు, విద్యాసంస్థల డైరెక్టర్‌

కేవోఎస్‌లో మెరుగైన విద్యా ప్రమాణాలతో బోధన సాగిస్తున్నాం. గత ఏడాది జిల్లాలో మొదటి మూడు ర్యాంకులు కైవసం చేసుకున్నాం. ఈసారి మొదటి మూడు ర్యాంకులతో పాటు 50 మంది ఐఐటీ అడ్వాన్స్‌కు అర్హత సాధించారు. సబ్జెక్టుల్లో నిష్ణాతులైన వారితో బోధన చేయిస్తున్నాం. అందుకు తాజా ఫలితాలే నిదర్శనం.

శిక్షణే పునాది : బి.శివప్రతం, విద్యార్థి(99.22శాతం)

జేఈఈ మెయిన్స్‌లో నేను సత్తా చాటడానికి కేవోఎస్‌ పాఠశాలే పునాది. అక్కడ ప్రతిరోజు అన్ని సబ్జెక్టులపై ఇంటర్‌, ఎంసెట్‌ స్థాయి లెక్చరర్లతో శిక్షణ ఇప్పించేవారు. పాఠశాలలో తీసుకున్న ప్రత్యేక శిక్షణ వల్ల ఉత్తమ మార్కులు సాధించగలిగాను.

కెవోఎస్‌లో శిక్షణతోనే జేఈఈలో పర్సంటైల్ : ఎండీ. మినహాజ్‌, విద్యార్థి(99.68శాతం)

జాతీయ పరీక్షల కోసం ప్రణాళికాబద్ధంగా బోధించే కేవోఎస్‌లో చదివాను. అక్కడి విద్యావిధానం వల్లే ప్రస్తుతం నేను జేఈఈ మెయిన్స్‌లో 99.68 శాతం మార్కులు సాధించాను. ప్రతిరోజు పద్ధతి ప్రకారం సబ్జెక్టుల పై బోధన సాగించేవారు.

Advertisement

Next Story