రతన్ పార్శీ అయినప్పటికీ.. దహన సంస్కారాలు ఎందుకంటే?

by M.Rajitha |
రతన్ పార్శీ అయినప్పటికీ.. దహన సంస్కారాలు ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : టాటా సన్స్ అధినేత రతన్ టాటా(Ratan Tata) దహన సంస్కారాలు ముంబయిలోని వర్లీ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. అయితే రతన్ పార్శీ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు జరిగాయి. పార్శీ మతస్తుల అంత్యక్రియలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సాంప్రదాయాలకు భిన్నంగా జరుగుతాయి. వీరి సాంప్రదాయం ప్రకారం చనిపోయినవారి మృతదేహాలను కాల్చడం, పూడ్చటం గాని చేయరు. వీరి ప్రత్యేక పద్ధతిని 'దోఖ్ మేనాశిని' అంటారు. మానవుని దేహం ప్రకృతి నుంచి వచ్చిందని దానిని తిరిగి ప్రకృతికే ఇవ్వాలన్నది వారి మతం చెప్తోంది. ఈ పద్ధతిలో అంత్యక్రియలకు ముందు మృతదేహానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం అంత్యక్రియల కోసం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశం లేదా నిర్మానుష్య కొండ మీదికి తీసుకు వెళ్తారు. ఆ ప్రదేశాన్ని 'టవర్ ఆఫ్ సైలెన్స్'(Tower of Silence) లేదా 'దక్మా'(Dakma) అని పిలుస్తారు. అక్కడ రాబందులు తినేందుకు వీలుగా ఆ పార్థివ దేహాన్ని ఉంచుతారు.

కాగా పార్శీల సంప్రదాయం కాకుండా నేడు రతన్ టాటా అంత్యక్రియలు దహన సంస్కార పద్ధతిలో చేయడం వెనుక గల కారణం ఏంటంటే.. రాబందులు లేకపోవడం. మృతదేహాన్ని తినడానికి రాబందులు ఏవీ రాకపోవడం వల్ల, ప్రస్తుతం పార్శీలు కూడా దహన సంస్కారాలను నిర్వహిస్తున్నారు. వారి మతంలో చెప్పినట్టు నీరు, అగ్ని, నేల కాలుష్యం అవకుండా ఎలక్ట్రిక్ పద్ధతిలో దహన ప్రక్రియలు చేస్తున్నారు. అయితే కరోనా సమయం నుంచే పార్శీలు ఈ పద్ధతిని పాటిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed