షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

by Sridhar Babu |
షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
X

దిశ, కామారెడ్డి : షబ్బీర్ అలీ సమక్షంలో పలువురు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామగౌడ్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీటీసీ రాజు, కో ఆప్షన్ మెంబర్ ఫాజిల్, వార్డు సభ్యులు శ్రీనివాస్, నవీన్, కుంట శ్రీనివాస్, స్వామి, శేఖర్, పోచయ్య, రఘు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు సత్యం, బాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పంపరి రమేష్ తో పాటు సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story