CPL: కరీబియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా సెయింట్ లూసియా కింగ్స్

by Maddikunta Saikiran |
CPL: కరీబియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా సెయింట్ లూసియా కింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(CPL) టోర్నీలో సెయింట్ లూసియా కింగ్స్(Saint Lucia Kings) టైటిల్ విజేతగా నిలిచింది. సోమవారం ఉదయం గయానా(Guyana)లోని ప్రొవిడెన్స్ స్టేడియం(Providence Stadium)లో జరిగిన ఫైనల్ మ్యాచులో గయానా అమెజాన్ వారియర్స్(Guyana Amazon Warriors)పై 6 వికెట్ల తేడాతో గెలిచి తొలి సారి కప్పు కొట్టింది. ఈ మ్యాచులో సెయింట్ లూసియా జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది.ఆ జట్టు తరుపున సౌతాఫ్రికా ఆటగాడు ప్రిటోరియస్ ఒక్కడే 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.సెయింట్ లూసియా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో గయానా జట్టు బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఒకానొక దశలో 97 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఆ జట్టు పీకల్లోతూ కష్టాల్లో పడింది. రోమారియో షెపర్డ్,ప్రిటోరియస్ కలిసి జట్టును ఆదుకున్నారు.దీంతో గయానా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.సెయింట్ లూసియా బౌలర్లలో ఆఫ్గన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు ఆరంభంలో తడబడ్డ రోస్టన్ చేస్ 39 పరుగులు 22 బంతుల్లో ఆరోన్ జోన్స్ 48 పరుగులు 31 బంతుల్లో రాణించడంతో ఆ జట్టు విజయం సాధించింది. గయానా బౌలర్లలో షెపర్డ్,సింక్లైర్,మోయిన్ అలీ, ప్రిటోరియస్ తలో వికెట్ తీశారు. అటు బ్యాటింగ్,ఇటు బౌలింగ్ లో ఆకట్టుకున్న రోస్టన్ చేస్ కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(Player of the Match)' అవార్డు లభించింది. అలాగే టోర్నీ మొత్తం నిలకడగా రాణించి 22 వికెట్లు తీసిన నూర్ అహ్మద్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్(Player of the Series)'గా ఎంపికయ్యాడు.కాగా సెయింట్ లూసియా కింగ్స్ తరుపున ప్రీతి జింటా(Preity Zinta) సహా యజమాని(Co-owner)గా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed