Amazon-MX Player: MX ప్లేయర్‌ను కొనుగోలు చేసిన అమెజాన్..మినీటీవీలో విలీనం

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-07 15:25:35.0  )
Amazon-MX Player: MX ప్లేయర్‌ను కొనుగోలు చేసిన అమెజాన్..మినీటీవీలో విలీనం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్(Amazon) భారతదేశ మార్కెట్లో తన వీడియో స్ట్రీమింగ్ సేవల పోర్ట్‌ఫోలియోను విస్తరించే దిశగా తన ప్రయత్నాలను మొదలు పెట్టింది.ఈ నేపథ్యంలో భారత్ కు చెందిన స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్‌(MX Player)ను కొనుగోలు చేసింది. ఈ మేరకు అమెజాన్ ఓ ప్రకటనలో అధికారంగా వెల్లడించింది. MX ప్లేయర్‌ను ఓటీటీ సేవలందించే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మినీటీవీలో(Amazon miniTV) విలీనం చేసి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌(Amazon MX Player)గా తీసుకొచ్చినట్లు తెలిపింది.MX ప్లేయర్‌ను ఎంతకు కొనుగోలు చేశారని వెల్లడించకపోయినా ఈ ఒప్పందం విలువ దాదాపు $100 మిలియన్లు (దాదాపు రూ. 834 కోట్లు) ఉంటుందని సమాచారం.

ఎంఎక్స్ ప్లేయర్ సేవలను యాప్, అమెజాన్.ఇన్ షాపింగ్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ కనెక్ట్‌డ్ టీవీల్లో చూడవచ్చని అమెజాన్ పేర్కొంది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌ విలీన ప్రక్రియ ఆటోమేటిక్ గా జరిగిపోతుందని, ఇందుకోసం MX ప్లేయర్‌ను రీ ఇన్ స్టాల్ చేయడం గానీ,అప్డేట్ చేయాల్సిన పని లేదని తెలిపింది.ఇదివరకు ఉన్నట్టుగానే MX ప్లేయర్‌ సేవలు మున్ముందు కూడా ఫ్రీగానే కొనసాగుతాయని తెలిపింది. కాగా భారతదేశంలో అతిపెద్ద OTT ప్లాట్‌ఫామ్ లో MX ప్లేయర్ ఒకటైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed