అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ.. పట్టించుకోని అధికారులు

by Aamani |
అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ.. పట్టించుకోని అధికారులు
X

దిశ, శంకర్పల్లి : శంకర్పల్లి మండలంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం గా తయారయింది. శంకర్పల్లి నుంచి గండిపేట వెళ్లే రహదారిపై దొం తాన్పల్లి స్టేజి వద్ద రోడ్డు పక్కనే చెత్త పారవేయడంతో కంపు వాసన లేస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్వచ్ఛత ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం తో ఎక్కడపడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తుండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి చెత్త డంపింగ్ యార్డ్ లో నిర్మిస్తున్న వర్మీ కంపోస్టు తయారు చేసి పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాన్ని తుంగలో తొక్కడం ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతుంది. ఇళ్లలో నుంచి సేకరించిన చెత్తను తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ లో వరివి కంపోస్ట్ తయారు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు అమలు కావడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామాలను తనిఖీ చేస్తే గాని స్వచ్ఛత ఈ కార్యక్రమాలు ఏ మేరకు విజయవంతం అవుతున్నాయో గ్రామస్తులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed