డ్రగ్స్ మత్తులో యువత.. ఉత్కంఠగా ‘యుఫోరియా’ గ్లింప్స్

by sudharani |   ( Updated:2024-10-07 15:22:48.0  )
డ్రగ్స్ మత్తులో యువత.. ఉత్కంఠగా ‘యుఫోరియా’ గ్లింప్స్
X

దిశ, సినిమా: సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్‌లో రాబోతున్న తాజా సినిమా ‘యుఫోరియా’. యూత్‌ఫుల్ సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఇందులో విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ భూమిక కీ రోల్‌లో అలరించనున్నారు. తాజాగా ‘యుఫోరియా’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గుణ శేఖర్ మొదటి చిత్రం లాఠీ. అది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆయన ఎన్నో సక్సెస్‌లు చూశారు. ఫెయిల్యూర్స్ కూడా చూశారు. ఫెయిల్యూర్స్ తరువాత వచ్చే సక్సెస్, ఆ సక్సెస్ ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. యుఫోరియా గ్లింప్స్ అదిరిపోయింది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. నైట్ లైఫ్, డ్రగ్స్ ఇలా ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఉంది. ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘యుఫోరియా గ్లింప్స్‌ను లాంచ్ చేసిన దిల్ రాజు, దాముకి థాంక్స్. అంతా కొత్త వారితో ఈ చిత్రం చేశాను. తొంభై శాతం అంతా కొత్త వాళ్లే కనిపిస్తారు. ఇప్పటి వరకు అరవై శాతం షూట్ పూర్తయింది. యుఫోరియా అంటే ఏంటి? అనేది జనాలకు పరిచయం చేయడానికి ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశాం. ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. ప్రతీ వారం అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఇప్పుడున్న టైంలో ఇలాంటి కథను చెప్పాలని అనిపించింది. ఇక యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పుడున్న యూత్ మైండ్ సెట్‌కు తగ్గట్టుగా సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. మంచి కంటెంట్‌తో వస్తే స్టార్ హీరో ఉన్నాడా? ఏ భాషలో వచ్చింది? అనేది ఆడియెన్స్ చూడటం లేదు. కథ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది’ అని అన్నారు.

Advertisement

Next Story