అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కారణం ఇదే!

by Gantepaka Srikanth |
అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశమవుతున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah)తో భేటీ అయ్యారు. తెలంగాణకు వరద సాయం పెంచాలని రిక్వెస్ట్ చేశారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపైనా సుదీర్ఘంగా చర్చించారు. మూసీ ప్రక్షాళన చేపట్టిన నేపథ్యంలో నమామీ గంగ తరహాలో నిధులు కేటాయించాలని కోరినట్లు సమాచారం. కాగా, భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సాయం అందించిన విషయం తెలిసిందే. తెలంగాణకు రూ.416.80 కోట్లు విడుదల చేసింది.

ఏపీకి రూ.1,036 కోట్లను ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద సాయం అందించింది. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అమిత్ షాకు వివరించి మరిన్ని నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. మరోవైపు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇల్లు, ఇంటిలోని సామాగ్రి, వాహనాలు, ఆటోలు దెబ్బతిని పూర్తిగా నిరాశ్రయిలయ్యారు. పంట పొలాలు, చేపల చెరువులు దెబ్బతిన్నాయి. దీంతో తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం.

Advertisement

Next Story