Balka Suman: రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి క్లియరెన్స్ ఇవ్వాలి.. బాల్క సుమన్ డిమాండ్

by Shiva |
Balka Suman: రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి క్లియరెన్స్ ఇవ్వాలి.. బాల్క సుమన్ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే ఆర్ధిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) డిమాండ్ చేశారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లోని తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పది నెలల కాంగ్రెస్ (Congress) పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ లాగా తాము ఇచ్చిన నోటిఫికేషన్లకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నియామక పత్రాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఆయన మాటలను విని ప్రజలకు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ (Hyderabad Youth Declaration) పేరుతో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)తో సభను నిర్వహించారని గుర్తు చేశారు. అదే సభ సాక్షిగా తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రియాంక గాంధీ చెప్పించిన విషయం ప్రజలు మర్చిపోలేదని అన్నారు.

ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ (Congress) చెప్పిందని ఆరోపించారు. అదేవిధంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడ పిల్లలకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తామని చెప్పారని అన్నారు. అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) జాబ్ క్యాలెండర్ (Job Calendar) రిలీజ్ చేశారని తెలిపారు. గ్రూప్-1 నియామకాలను ఏప్రిల్-2024లో చేస్తామని ఆ పార్టీ చెప్పిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని అన్నారు. పక్కా నిరుద్యోగుల ఓట్ల కోసం జాబ్ క్యాలెండర్ అంటూ యువతను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న తాము 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. 2.27 లక్షల ఉద్యోగాలకు బీఆర్ఎస్ (BRS) హయాంలోనే నోటిఫికేషన్లు ఇచ్చామని, నేడు ఉద్యోగాల విషయంలో సీఎం చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని బాల్క సుమన్ (Balk Suman) అన్నారు.

అందరి రైతలకు రూ.2 లక్షల రుణమాఫీ అయిపోయిందంటూ సీఎం అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. హైడ్రా (HYDRA), మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రజల ఆటెన్షన్‌ను డైవర్ట్ చేస్తుందని.. నిరుద్యోగులకు శూన్య హస్తం ఇచ్చిందని అన్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగులను సీఎం ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. ఒక్క మంత్రి కూడా నిరుద్యోగులకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారా అని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress) నేతలు నిరుద్యోగుల చుట్టూ తిరిగి రాష్ట్రం అంతా యాత్రలు చేయించారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్ధిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed