కౌంటింగ్ హాల్ నుండి వెళ్లిపోయిన జీవన్​రెడ్డి

by Sridhar Babu |
కౌంటింగ్ హాల్ నుండి వెళ్లిపోయిన జీవన్​రెడ్డి
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఉత్కంఠ భరితంగా కొనసాగిన నిజామాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హోరా హోరీగా తలపడ్డాయి. అయితే మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లోని సీఎంసీ భవనంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు హాల్ కు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి అరవింద్ కు స్పష్టమైన మెజారిటీ లభించడంతో ఆయన కౌంటింగ్ హాల్ నుండి వెను తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి అరవింద్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఐదేళ్లు ఎంపీగా

పనిచేసిన అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఇప్పటికైనా ఆయన గెలవనున్న సందర్భంగా పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా చెరుకు రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వెంటనే చక్కెర కర్మగారాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగరాన్ని మార్చ్ సిటీగా చేయాల్సిన బాధ్యత కూడా అరవింద్ పైనే ఉందన్నారు.

Next Story

Most Viewed