Sukesh: జాక్వెలిన్ అభిమానులకు ఆమె ప్రియుడు బంపరాఫర్.. 10 థార్స్, 100 ఐఫోన్ 16 ప్రో గెలుచుకునే ఛాన్స్

by Prasad Jukanti |   ( Updated:2024-10-04 09:51:05.0  )
Sukesh: జాక్వెలిన్  అభిమానులకు ఆమె ప్రియుడు బంపరాఫర్.. 10 థార్స్, 100 ఐఫోన్ 16 ప్రో గెలుచుకునే ఛాన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్థిక మోసాలకు పాల్పడి ఈడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఢిల్లీ మండోలీ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ తన ప్రియురాలు, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ అభిమానులకు దీపావళి బోనాంజా ప్రకటించాడు. జాక్వెలిన్ మ్యూజిక్ వీడియో స్టార్మ్ రైడర్‌ ప్రమోషన్‌లో భాగంగా 100 మిలియన్లకు చేరుకోవడానికి సహాయపడే వారికి కానుకలు అందివ్వబోతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు జాక్వెలిన్‌కు లేఖను రాశాడు. దీపావళి రోజున నిర్వహించే లక్కీ డ్రాలో టాప్ 10 విజేతలకు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్‌తో పాటు సరికొత్త మహీంద్రా థార్ రాక్స్ అందుకుంటారని పేర్కొన్నాడు. తదుపరి 90 విజేతలు ప్రతి ఒక్కరూ ఐ ఫోన్ 16 ప్రోను అందుకుంటారని తెలిపాడు. అయితే ఈ కానుకలు అందుకోవాలంటే కండీషన్లు పెట్టాడు. ఈ లక్కీ 100 లో పార్టిసిపెంట్ చేయాలనుకునేవారు జాక్వెలిన్ అఫీషియల్ యూట్యూబ్ చానెల్‌ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని వారి అధికారిక ఈ-మెయిల్ లేదా యూట్యూబ్ ఐడీని ఉపయోగించి ఒకలైక్‌, కామెంట్ ఇవ్వాలి. అలాగే నవంబర్ 2024 నాటికి స్టార్ రైడర్‌ను 100 మిలియనన్ల వ్యూస్ దాటేందుకు సపోర్టుగా నిలవాలని కండీషన్లు పెట్టాడు. అలాగే జాక్వెలిన్ కోసం బోయింగ్ కార్పొరేట్ జెట్ విమానం కొనుగోలు చేసినట్లు ప్రకటించాడు.

Advertisement

Next Story

Most Viewed