- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ముంచింది కాంగ్రెస్ పార్టీనే
దిశ, బోధన్ : ఆసియా ఖండలో పేరెన్నికగన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని కాంగ్రెస్ పార్టీ మంచిదని, మరోసారి గెలిస్తే భూములు అమ్ముకుంటారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. బోధన్ లో మంగళవారం నిర్వహించిన యువ సమ్మేళనం లో మాట్లాడుతూ బీజేపీ గెలిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తామని అన్నారు. జిల్లాలోని పసుపు, చెరుకు రైతులను కాంగ్రెక్ పార్టీ ముంచిందని ధ్వజమెత్తారు. క్వింటాలకు 3100 ప్రకటించిన బీజేపీ రైతుపక్షపాతి అని తెలిపారు. సుదర్శన్ రెడ్డి గెలిచినా, ఓడినా బోధన్ కు రాడని, స్థానిక నాయకుడు మోహన్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
రేవంత్ రెడ్డి, కవిత బిజినెస్ పార్ట్నర్స్
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కవిత లు బిజినెస్ పార్ట్నర్స్ అని, బయటకు మాత్రం తన శత్రువు రేవంత్ రెడ్డి అని ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. కవిత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం లేదని, అందుకే కోరుట్ల లో పోటీ చేస్తానని చెప్పి వెనకడుగు వేసిందని విమర్శించారు.
కల్వకుంటోళ్లకు ఫ్యూచర్ లో కారాగారమే ..
ఈ నెల 23 న లిక్కర్ కేసు సుప్రీం కోర్టులో విచారణకు వస్తుందని, త్వరలోనే కల్వకుంట్ల వారిని కారాగారంనకు పంపిస్తామని అన్నారు. లిక్కర్ కేసులో ఎవరిని వదలబోమని అన్నారు. కాసుల బాలరాజ్ ఆసుపత్రి పాలైనా రేవంత్ రెడ్డి పాలకరించలేదన్నారు. ఎస్పీ వర్గీకరణ కు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు.