ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి నోటిఫికేషన్ జారీ చేయండి

by Naresh |
ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి నోటిఫికేషన్ జారీ చేయండి
X

దిశ, ఆర్మూర్‌: ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి నోటిఫికేషన్ జారీ చేయండని ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్‌ను కోరారు. శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ కు చెందిన పలువురు కౌన్సిలర్లు ఆర్మూర్ ఆర్డివో‌ను కలిసి ఆర్డీఓ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి నోటిఫికేషన్ ఇవ్వడంలో జాప్యం జరిగితే ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నకు ఇంచార్జ్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించాలని ఆర్డీవో ను మున్సిపల్ కౌన్సిలర్లు కోరారు. దీంతో ఆర్మూర్ ఆర్డీవో ఈ విషయం నా పరిధిలో లేదని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని మున్సిపల్ కౌన్సిలర్లకు ఆర్డీఓ సూచించారు. అంతకుముందు మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్మూర్ మున్సిపల్‌కు చైర్ పర్సన్ లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని, అధికారులు స్పందించి కనీసం ఇన్చార్జ్ చైర్మన్‌ను అయినా నియమించాలని ఆర్డీవోను కోరారు. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ... మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయ లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ధర్నా చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ మున్న, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కౌన్సిలర్ల భర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed