ఆర్మూర్ గురుకుల డిగ్రీలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

by Sridhar Babu |
ఆర్మూర్ గురుకుల డిగ్రీలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులను బోధించుటకు అతిథి అధ్యాపకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.ధనవేణి శనివారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 11వ తేదీ లోపు వారి దరఖాస్తులను కళాశాలలో అందజేయాలన్నారు.

సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థిని లు అర్హులన్నారు. నెట్, సెట్, పీహెచ్ డీ, బోధన అనుభవం ఉన్నవారికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాత పరీక్ష, డెమో ఇంటర్వ్యూ ఆధారంగా ఈనెల 19వ తేదీన ఎంపిక ఉంటుందన్నారు. సంబంధిత సబ్జెక్టులలో బోధించేందుకు ఆసక్తిగల మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జి. ధనవేణి తెలిపారు.

Advertisement

Next Story