- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సైకిల్ ర్యాలీ..
దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ అర్బన్ న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైకిల్ ర్యాలీ నిజామాబాద్ బస్టాండ్ నుండి పాత కలెక్టరేట్ మీదుగా జిల్లా కోర్ట్ నుండి తిరిగి బస్టాండ్ చేరుకుందని జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం తెలిపారు. ర్యాలీని ఉద్దేశించి రైల్వే మాజీ న్యాయమూర్తి వై.కృష్ణ గోపాల్ రావు, నగర అధ్యక్షులు రణం రవీందర్ గౌడ్, మాజీ నగర అధ్యక్షులు తుకారాం, దూస రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ సైకిల్ ని మరిచి పెట్రోల్ వాహనాలు నడపడం మూలంగా పర్యావరణ కాలుష్యం, అనారోగ్య సమస్యలతో పాటు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇది భవిష్యత్ తరాలకు అత్యంత హానికరం.
సైకిల్ తొక్కడం వల్ల గుండె జబ్బులతో పాటు షుగర్, అధిక రక్తపోటు వంటి వాటి నుండి విముక్తి కలిగించి, ఎటువంటి వైద్య ఖర్చులు లేకుండా ఉచితంగా ఆయురారోగ్యాలతో జీవించవచ్చునని తెలిపారు. ప్రస్తుతం భారత దేశంలో కేవలం శారీరక శ్రమ లేకపోవడం వల్ల 60% మరణాలు సంభవిస్తున్నాయని వారన్నారు. పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం సైక్లింగ్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ ర్యాలీలో సైకిల్ తొక్కండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సైకిల్ తొక్కండి, పర్యావరణాన్ని కాపాడండి అని నినాధాలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు కె.రాజ్ గోపాల్, ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీకాంత్, కోశాధికారి కె.శంకర్, మధుసూదన్, సుధాకర్, శివ, సీహెచ్ రమేష్, బాలరాజ్, కళ్యాణ్, రమణ, శ్రవణ్, సాయి ప్రసాద్, అన్ని దినపత్రికల డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు.