- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అంతే..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల బుదవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుండి ఏప్రిల్ 04వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 .00 గంటల నుండి మధ్యాహ్నం 12 .00 గంటల వరకు జరుగనున్నఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం ఎర్పాట్లు చేసింది. ఈ సారి కుడా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరిక్షలకు పకడ్బంధి ఎర్పాట్లు చేశారు. పరిక్ష కేంద్రంలోకి విద్యార్ధులను ఒక్కనిమిషం అలస్యమైన అనుమతించరు. ప్రతి పరిక్షా కేంద్రంలో ప్రిన్సిపాల్ రూంలో సీసీ కెమోరాలను ఎర్పాటు చేసి అక్కడ ప్రశ్న పత్రాల సీల్ తీయనున్నారు. ప్రతి పరిక్ష కేంద్రం వద్ధ 144 సెక్షన్ అమలు చేయ్యనున్నారు. పరిక్ష కేంద్రంలో విద్యార్ధులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. పరిక్ష కేంద్రాల వద్ధ జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తారు. పరిక్ష కేంద్రలలోకి ఇంటర్నెట్ ద్వార డౌన్ లోడ్ చేసుకున్న హల్ టికేట్ లను అనుమతిస్తారు. పరిక్ష కేంద్రంలోకి సెల్ పోన్ లు , ఎలక్ర్టానిక్ గాడ్జేట్ ల అనుమతించరు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరిక్ష సమయాలకు అనుగుణంగా అన్ని రూట్లలో విద్యార్థులు సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 35017 మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 17503 మంది మొదటి సంవత్సరం పరీక్షలు రాయనుండగా, 17514 మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారు.వీరి కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చేస్తారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా, వాటిని పరిష్కరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ నెంబర్: 08462 - 295452 ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 3 ప్లైయింగ్ స్క్వాడ్, 1 హెచ్ పిసి, 1 డిఇసి, 8 సిట్టింగ్ స్క్వాడ్ లను ఎర్పాటు చేశారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్లు ఏర్పాటు చేసారు. మొదటి సంవత్సరం 7495 మంది విద్యార్థులు రెండవ సంవత్సరం 6253 మొత్తంగా 13,748 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్ధులు.cgg.com tsbie com నుంచి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ అనుమతించబడుతాయి. .విద్యార్థుల కోసం ఒత్తిడి జయించడానికి టెలీ మానస్ అనే టోల్ ఫ్రీ నెంబర్ 14416 ఏర్పాటు చేశారు.