లైన్ మెన్ పై అనుచిత వ్యాఖ్యలు

by Naresh |
లైన్ మెన్ పై అనుచిత వ్యాఖ్యలు
X

దిశ, నవీపేట్‌: కరెంట్ కనెక్షన్ తొలగించడంతో మండల కేంద్రానికి చెందిన ఓ వినియోగదారుడు విద్యుత్ లైన్ మెన్‌ను ఫోన్‌లో తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాలు ఇలా ఉన్నాయి మండల కేంద్రానికి చెందిన ఓ వినియోగదారుడికి చెందిన 636 సర్వీస్ నెంబర్ రూ. 3660కు రూపాయలు బాకీ ఉండటంతో విద్యుత్ సిబ్బంది సోమవారం కనెక్షన్ తొలగించడంతో ఆగ్రహించిన సదరు వినియోగదారుడు నవీపేట్ లైన్ మెన్ కృష్ణతో ఫోన్‌లో మాట్లాడుతూ తిట్ల దండకం మొదలు పెట్టాడు, దీంతో ఆగ్రహించిన విద్యుత్ సిబ్బంది సదరు వినియోగదారుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏ.డి.ఈ.సుహాసిని, ఏ.ఈ. ప్రవీణ్, ఇతర లైన్ మెన్లు , విద్యుత్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రేపటినుండి విధులకు దూరం...?

విద్యుత్ లైన్ మెన్ పై దుర్బాషలాడడంతో మనస్తాపం చెందిన లైన్ మెన్ రేపటి నుంచి విధులకు దూరం అని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సదరు లైన్ మెన్‌తో సహా ఇతర లిబ్ మెన్ లు, విద్యుత్ సిబ్బంది విధులకు దూరంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed