కత్తి చూపించి చైన్ స్నాచింగ్ ...

by Sumithra |
కత్తి చూపించి చైన్ స్నాచింగ్ ...
X

దిశ, భిక్కనూరు : దావత్ కు వచ్చి... తిరిగి ఇంటికి వెళుతుండగా భార్యాభర్తలను కిందపడేసి మూడుతులాల బంగారు గొలుసు అపహరించుకుపోయిన సంఘటన భిక్కనూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్యారం గ్రామానికి చెందిన కొనింటి నర్సయ్య, భార్యమల్లవలు రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం వద్ద బంధువుల దావత్ ఉండడంతో ఇక్కడికి వచ్చారు. దావత్ ముగిసిన తరువాత భార్యాభర్తలు రేణుక దేవి ఎల్లమ్మ ఆలయం నుంచి, నందివిగ్రహం వరకు వెళ్లి బస్సు ఎక్కేందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఎల్లమ్మ ఆలయం దాటికొద్ది దూరం వెళ్లిన తరువాత గుర్తు తెలియని ఇద్దరు దుండగులు, కాషాయ రంగు ధరించిన తలపాగ చుట్టుకొని వచ్చి, భార్యభర్తలనిద్దరిని కింద పడేసి, కేకలు పెట్టకుండా తమవద్ద ఉన్న కత్తితో బెదిరించి మల్లవ్వ మెడలో నుంచి మూడుతులాల విలువచేసే బంగారు పుస్తెలతాడును అపహరించుకుపోయారు. ఈ మేరకు బాధితురాలు మల్లవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఘటనాస్థలాన్ని భిక్కనూరు సీఐ తిరుపయ్య సందర్శించి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed