టీయూలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంలో తక్షణ ప్రవేశాలు..

by Sumithra |   ( Updated:2024-12-17 15:30:33.0  )
టీయూలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంలో తక్షణ ప్రవేశాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో ఎల్.ఎల్.బి కోర్సులో ఖాళీగా ఉన్న 14 సీట్లలో 12 సీట్లు, ఎల్.ఎల్.ఎంలో ఖాళీగా ఉన్న ఒక సీటును భర్తీ చేసినట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ పేర్కొన్నారు. 2024 స్టేట్ ఎంట్రన్స్ ర్యాంక్ మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తూ విశ్వవిద్యాలయ నిబంధనలను అనుసరించి తక్షణ ప్రవేశాలను భర్తీ చేసినట్లు సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఈ తక్షణ ప్రవేశాల్లో 29 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రవేశాల ప్రక్రియ న్యాయ కళాశాలలో సెమినార్ హాలులో నిర్వహించి ఎంపికైన విద్యార్థుల వివరాలు ప్రకటించామని అడ్మిషన్స్ డైరెక్టర్ పేర్కొన్నారు. తక్షణ ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఫీ రియింబర్స్ మెంట్, హాస్టల్ వసతి ఇవ్వబడదని ఆయన తెలిపారు.

తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఆచార్య ఎం. యాదగిరి కొనసాగింపు

టీయూ రిజిస్ట్రార్ గా ఆచార్య.ఎం. యాదగిరి రిజిస్ట్రార్ పదవి కాలం ఈ నెల 15 న ముగియడంతో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆచార్య ఎం. యాదగిరి నే రిజిస్ట్రార్ గా కొనసాగేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య. టి. యాదగిరిరావు నియామకం ఉత్తర్వులు విడుదల చేశారు.

Advertisement

Next Story