- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మధ్యాహ్న భోజనం బియ్యం పక్కదారి.. విచారణ జరిపిన అధికారులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ స్కూల్ కు సంబంధించిన మధ్యాహ్న భోజనం కు కేటాయించిన బియ్యం పక్కదారి పట్టాయి. ఈనెల 18న నగరంలోని వాటర్ ట్యాంక్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ కు సంబంధించిన బియ్యం బస్తాలు ఇద్దరు యువకులు బైక్ పై తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు. బియ్యం బస్తాలు ఎక్కడికి తరలిస్తున్నారని అరా తీయగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాకుడు ఖదీర్ ఆదేశాల మేరకే తరలిస్తున్నట్టు యువకులు చెప్పారు. ఆ సమయంలో పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు లేకపోవడంతో బియ్యం తరలింపు పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శనివారం పాఠశాలకు సంబంధించి నాలుగు క్వింటాళ్ల బియ్యం ఎమ్మెల్యే స్పాట్ నుంచి వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి.
పాఠశాలకు సంబంధించి మధ్యాహ్న భోజనం కు సరిపడా బియ్యం లేకపోవడంతో అరువు తెచ్చామని ప్రధానోపాధ్యాయుడు తెలపడం విశేషం. ప్రభుత్వ పాఠశాలలకు లోటు లేకుండా ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సరఫరా చేస్తుండగా వాటర్ ట్యాంక్ జిపిఎస్ లో రికార్డులు మాత్రం నోటు ఉన్నట్టు చూపడం గమనార్హం. ఈ విషయం తెలిసి జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గ ప్రసాద్ విచారణకు ఆదేశించారు. మంగళవారం విద్యాశాఖ సంబంధించిన ఒక అధికారి విచారణ జరిపి నివేదిక సమర్పించారు. బియ్యం పక్కదారిపై సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని వివరణ కోరిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది.