ఇత్తువేసి పొత్తు కూడినట్టు ఉంది కేంద్ర ప్రభుత్వం తీరు.. బాజిరెడ్డి గోవర్ధన్

by Sumithra |
ఇత్తువేసి పొత్తు కూడినట్టు ఉంది కేంద్ర ప్రభుత్వం తీరు.. బాజిరెడ్డి గోవర్ధన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు పంపిస్తుందని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని వారు చెప్పేదంతా అసత్య ప్రచారమేనని కొట్టిపారేశారు రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. బుధవారం నిజామాబాద్ రూరల్ మండలం పాల్ద గ్రామ పంచాయతీ భవనాన్నిబాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా బాజీరెడ్డి మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదు అనీ ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్లు నిధులు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం 30 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.

కానీ స్థానిక ఎంపీ అరవింద్ రైల్వే బ్రిడ్జిలు తానే తెప్పించానని సోప్టాప్ చేయడం గొప్పలు చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గంలోని పాల్ద గ్రామంజాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీగా అవార్డు పొందడం ఎంతో గర్వకారణమని, మిగతా గ్రామాలను సైతం సమానంగా అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నది అన్నారు. గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టిందని పరిపాలనా సౌలభ్యంతో పాటు మారుమూల పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనూష, జడ్పిటిసి సుమలత, సర్పంచ్ సుప్రియ ఎంపీటీసీ సభ్యురాలు మమత, నుడ డైరెక్టర్ సంతోష్, పార్టీ మండల అధ్యక్షుడు మధుకర్, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed