కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవు

by Sridhar Babu |
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవు
X

దిశ, లింగంపేట్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో తిరిగి కరెంటు కష్టాలు మొదలవుతాయని బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి, ఎల్లా రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేందర్ వెల్లడించారు. మండలంలోని మోతే,ఎల్లారం, ముస్తాపూర్, ఒంటరిపల్లి, కోమటిపల్లి, పోతాయిపల్లి, పోల్కంపేట్, కన్నాపూర్, ఐలాపూర్, రాంపల్లి, మెంగారమ్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన ప్రజలకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి

వచ్చిన అనంతరం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎల్లా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులకు మద్దతు ప్రకటించాలని ఆయన ఓటర్లను కోరారు. స్థానికేతర నాయకులకు సమస్యలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. నాడు సమైక్యరాష్ట్రంలో వ్యవసాయం దండగన్న నాయకులకు వ్యవసాయాన్ని పండగ చేసి చూపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సంపత్ గౌడ్ తో పాటు ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed