Nitin Gadkari: ఇథనాల్, ఫ్లెక్స్ ఇంధనాల వినియోగం పెంచాలన్న నితిన్ గడ్కరీ

by S Gopi |
Nitin Gadkari: ఇథనాల్, ఫ్లెక్స్ ఇంధనాల వినియోగం పెంచాలన్న నితిన్ గడ్కరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన తయారీ సంస్థలు ఇథనాల్, ఫ్లెక్స్ ఇంధనాలను మరింత విరివిగా వినియోగంలోకి తెచ్చే అవకాశాలను అన్వేషించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మంగళవారం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రతినిధులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. ఇథనాల్, ఫ్లెక్స్ ఇంధనాలు ప్రజలు ఎక్కువ వాడే మార్గాలను పరిశీలించాలి. రాబోయే నెలల్లో ఇథనాల్‌తో నడిచే వాహనాలను లాంచ్ చేసేందుకు పరిశ్రమ చర్యలు తీసుకోవాలి. బ్రెజిల్ దేశం తన రవాణాలో ఫ్లెక్స్ ఇంధనాలు, జీవ ఇంధనాలను విజయవంతంగా కొనసాగిస్తోంది. దేశీయంగా కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా ఆయా ఇంధనాలను వాడే అంశాలను పరిశీలించాలని సియామ్ సభ్యులను కోరారు. శిలాజ ఇంధనాల నుంచి జీవ ఇంధనాలకు మారడం ద్వారా దేశం స్వావలంబనగా మారుతుంది. కాలుష్యాన్ని తగ్గించడం, చమురు దిగుమతులు తగ్గించడం, వినియోగదారులకు తక్కువ ధరకే ఇంధనాన్ని అందించే వీలుంటుందని గడ్కరీ తెలిపారు. వీటన్నిటీ ద్వారా మన రైతులకు ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed