- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి అధికారం ఇస్తే.. ఆర్‌ఎస్‌ఎస్ చేతికి తుపాకులు : ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్
రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకునేందుకే ఆ రెండు పార్టీలు
చర్చనీయాంశంగా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీజేపీ అధికారం ఇస్తే.. ఆర్ఎస్ఎస్ వాళ్లకు తుపాకులిచ్చి ప్రజలను చంపమంటుందని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ వివాదస్పంద వ్యాఖ్యలు చేశారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా చేసిన సీఎం కేసీఆర్‌ను టచ్ చేసే మొనగాడే ఇంక పుట్టలేదని ఆయన అన్నారు. సోమవారం ధర్పల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆర్థికంగా పురోగతి సాధించారని తెలిపారు. తెలంగాణ ఇంకొకరికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌ఘడ్ లాంటి బీజేపీ పాలిత ప్రాంతాల ప్రజలకు మనం ఇక్కడ పని కల్పించి ఉపాధి అందిస్తున్నామని తెలిపారు. బీజేపీ నాయకులకు సోషల్ మీడియాలో మాత్రమే దుష్ప్రచారం చేయడం తెలుసని ఎద్దేవా చేశారు.
కనీసం బీజేపీకి ఊళ్లలో కార్యకర్తలు సరిగ్గా లేరని అన్నారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పుకుండా.. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. సీఎం సీటు ఊరికే రాదని.. కేసీఆర్‌ను టచ్ చేసే దమ్ము, ధైర్యం ఏ మొనగాడికి లేదన్నారు. సాహసోపేత నిర్ణయాలతో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశాన్నే అబ్బురపరుస్తున్నయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేందుకు రాబందుల్లా తిరుగుతున్నారని అన్నారు.
అప్రజాస్వామిక పాలనతో ముంబైని దోచుకున్నారని, ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీద పడ్డారని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ.జీ గౌడ్, జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్ యాదవ్, ఎంపీపీ సారిక హన్మంత్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More... మంత్రి హరీష్ రావు స్వగ్రామంలో రోడ్డెక్కిన రైతన్నలు
ఆ ప్రచారాన్ని తిప్పికొట్టండి.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో దాసోజు కీలక వ్యాఖ్యలు