- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ అబద్దాలకు డాడీ : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..
దిశ, ఆర్మూర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అబద్దాలకు డాడీ అని, ఆయన మాటలు కోటలు దాటినా చేతలు ఢిల్లీ గడప దాటవని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలానికి చెందిన వందలాది మంది యువకులు బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో బీజేపీ పార్టీ మాక్లూర్ మండల ఉపాధ్యక్షులు ప్రశాంత్, ముఖ్య నాయకులు అరవింద్, ప్రమోద్, నితిన్, చిన్న ప్రశాంత్, వినయ్, స్వామి, చందు, భరత్, కిట్టు, అజయ్, రాకేష్, మోహన్, సాయిలు, సురేష్, సుధాకర్, వసంత్, రఘు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ బంజారహిల్స్ రోడ్ నెం.12 లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
గులాబీ కండువాలు వేసి జీవన్ రెడ్డి వారిని బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించి, పార్టీలో వారికి సముచిత స్థానం, రెట్టింపు గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ను బీసీలు, రైతుల సంక్షేమ పార్టీగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కూదివాణం లేని పార్టీ అని బీజేపీకి అంత సీన్ లేదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ తోనే ముడిపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ అంటేనే బడా జూటా పార్టీ అని , ఒక్క ఎన్నికల హామీని కూడా నిలబెట్టుకోలేదని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానని హామీఇచ్చి మోసం చేశారని ఆయన ఆరోపించారు.
దేశవ్యాప్తంగా జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయించారని, చివరకు జనానికి ఖాళీ అకౌంట్లు మిగలగా అంబానీ, ఆదానీల ఇండ్లకు భారీగా ధనం చేరుతున్నదని ఆయన నిప్పులు చెరిగారు. విదేశాల నుంచి నల్లధనం తేకపోగా దేశంలోని మూలాధనాన్నే అమ్మేస్తున్నారని విమర్శించారు. మోడీ ఎప్పుడూ అబద్ధం తప్ప నిజం పలకరన్నారు. ఏడాదికి 2కోట్ల చొప్పున ఉద్యోగాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్న కొలువులనే పీకేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో నరేందర్ మోడీ.. నిజామాబాద్ లో అరవింద్ కేడీ అంటూ మండిపడ్డారు. బీజేపీలో అందరూ మోసగాళ్లకు మోసగాళ్లే. బీజేపీ అంటేనే మతాల మధ్య చిచ్చు. విద్వేషపూరిత రాజకీయమే కమలనాథుల సిద్ధాంతం.
బీఆర్ఎస్ బీసీలు, రైతుల సంక్షేమ పార్టీ అని అన్నారు. బీజేపీలోని యువత చూపు బీఆర్ఎస్ వైపు పడింది. సీఎం కేసీఆర్ తోనే తమకు మేలు జరుగుతుందని యువతరం భావిస్తున్నదన్నారు. సబ్బండ వర్గాలూ కారు, సారు, కేసీఆర్ వైపే అడుగులేస్తున్నాయి. బీఆర్ఎస్ అంటే ప్రజల కోసం పనిచేసే ఒక విజన్. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నెంబర్-1, ఇక వార్ వన్ సైడే ఆర్మూర్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ఆర్మూర్ అని జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన నాయకులు కంఠం అభిలాష్, జాద్ సురేష్, చిన్న రమేష్, శ్రీకాంత్, రజినికాంత్, రాము, గుంజిలి రంజిత్, మహేందర్, సర్పంచులు చిన్నారెడ్డి, ప్రవీణ్, మాజీ ఎంపీటీసి గాల్వే గంగాధర్, సీనియర్ నేత మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.