మానవత్వం చాటిన న్యాయవాదికి సన్మానం

by Shiva |
మానవత్వం చాటిన న్యాయవాదికి సన్మానం
X

దిశ, ఆర్మూర్ : పట్టణంలోని కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మానవత్వం చాటిన న్యాయవాది పెద్దొళ్ల దేవన్నను తోటి న్యాయవాదులు పట్టు శాలువాతో మంగళవారం ఘనంగా సన్మానించారు. నందిపేట్ లోని రాంనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న శబరి (60) అనే మహిళ మృతి చెందగా ఇంటి యజమాని అద్దె ఇంటిలో అంత్యక్రియలకు అనుమతి ఇవ్వకపోవడంతో అదే కాలనీలో నివాసముంటున్న న్యాయవాది దేవన్న అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆయన ఇంటిని వాడుకోమని అవకాశం ఇచ్చి మానవత్వం చాటారు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు దేవన్నను అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గట్టడి ఆనంద్, జక్కుల శ్రీధర్, అల్జాపూర్ చంద్రప్రకాష్, విప్లవ కిరణ్, కీర్తి సాగర్, గణేష్, సుభాష్, చైతన్య, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story