హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ మెసేజ్ లు.. ఓపెన్ చేస్తే డబ్బులు మాయం..

by Nagam Mallesh |
హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ మెసేజ్ లు.. ఓపెన్ చేస్తే డబ్బులు మాయం..
X

దిశ, ఎల్లారెడ్డిః సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. సందర్భాన్ని బట్టి పండగలు, ప్రత్యేక రోజుల్లో విషెస్ పేరుతో మెసేజ్ లు పంపిస్తున్నారు. తీరా అవి ఓపెన్ చేసి చూస్తే మాత్రం కచ్చితంగా అకౌంట్లలో డబ్బులు మొత్తం గాయబ్ అవుతున్నాయి. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ మెసేజ్ లు, మీకు రివార్డులు వచ్చాయని ఫోన్ పే, గూగుల్ పే ద్వారా.. 1971 రూపాయలు రివార్డ్ వచ్చిందని లింక్ లు పంపిస్తారని ఎస్సై మహేష్ తెలిపారు. అవి గనక ఓపెన్ చేసి చూస్తే మీ డబ్బులు మొత్తం గాయబ్ అవుతాయని ఆయన వివరించారు. మన ఫోన్ లోకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎవరూ క్యాష్ బ్యాక్ పంపరని.. కాబట్టి అలాంటి లింకులు ఓపెన్ చేయొద్దంటూ ఆయన హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed