కార్పొరేషన్ రుణం పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకుడి చేతివాటం

by Naresh |
కార్పొరేషన్ రుణం పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకుడి చేతివాటం
X

దిశ, లింగంపేట్: గిరిజన కార్పొరేషన్ కింద రుణం ఇప్పిస్తానని చెప్పి బాధితుడి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రూ. 6000 వసూలు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పడమర తండాకు చెందిన కుర్ర శంకర్ అనే గిరిజన రైతు గత సంవత్సరం గిరిజన కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రైతు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన చేతివాటాన్ని ప్రదర్శించారు. గిరిజన కార్పొరేషన్ కింద రుణం ఇప్పించడానికి కొంత ఖర్చు అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాధితునికి వివరించడంతో రుణం తొందరగా వస్తుందని ఆశతో రూ. 6000 సదర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఇచ్చినట్లు తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రభుత్వం రుణాలు మంజూరు బ్రేక్ చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. గత సంవత్సరం రుణాల కోసం వేసిన నోటిఫికేషన్ బ్రేక్ పడటంతో బాధితుడు రుణం మంజూరు కోసం ఇచ్చిన రూ. 6000 రూపాయలు తిరిగి ఇవ్వాలని కోరగా సదరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణం వస్తుందనే ఆశతో కూలీ చేసిన డబ్బులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వగా తిరిగి ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులతో నిత్యం గొడవలు జరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోసం చేసిన విషయాన్ని బాధితుడు ఎంపీపీ గరీబున్ని నయీమ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిపాడు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రుణం పేరిట గిరిజన రైతు వద్ద చేతివాటం ప్రదర్శించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గిరిజన కార్పొరేషన్ రుణం ఇప్పిస్తానని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చేతివాటం ప్రదర్శన పై స్థానిక శాసనసభ్యులు మదన్ మోహన్ రావు జోక్యం చేసుకుని తనకు డబ్బులు ఇప్పించాలని గిరిజన రైతు ఎమ్మెల్యేను కోరుతున్నాడు.

Advertisement

Next Story