నాకు ప్రాణ హాని ఉంది.. రక్షించండి: ఉపాధి హామీ కూలీ కీర్తన

by srinivas |
నాకు ప్రాణ హాని ఉంది.. రక్షించండి: ఉపాధి హామీ కూలీ కీర్తన
X

దిశ ఆర్మూర్ : తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని దేగం గ్రామ నర్సరీలో పని చేస్తున్న ఉపాధి హామీ కూలి కీర్తన ఆర్మూర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఈ నెల 6న కొందరు మహిళలు తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. తిరుపతి అనే వ్యక్తితో తనకు అక్రమ సంబంధం అంటగడ్డి.. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంఘాల నాయకులు, పోలీసులు, హ్యూమన్ రైట్స్ వాళ్ల మంటూ బెదిరించారని కీర్తన ఆరోపించారు.

అయితే పోలీసులు ఇంత వరకూ కేసులు నమోదు చేయకపోవడంపై బాధితురాలు కీర్తన అసహనం వ్యక్తం చేశారు. గంట జ్యోతి అనే మహిళా గ్యాంగ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని, ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని కీర్తన ప్రశ్నించారు.

ఇప్పటికైనా పోలీసులు విచారణ జరిపి తనపై దాడి చేసి చంపడానికి యత్నించిన వారిపై కేసు నమోదు చేయాలని కీర్తన వేడుకున్నారు. తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోలీసు ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదు చేస్తానని బాధితురాలు కీర్తనహెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed