స్కూల్స్ సెలవుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలి: ట్రస్మా

by Disha News Desk |
స్కూల్స్ సెలవుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలి: ట్రస్మా
X

దిశ, నవీపేట్: కరోనా తీవ్రత పేరుతో సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న మార్కెట్స్, సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, వైన్స్, బార్స్, క్లబ్స్, లు బంద్ పెట్టకుండా కోవిడ్ పై అవగాహన ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యనందించే విద్యాసంస్థలను మూసివేయడం సరియైన విధానం కాదన్నారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని, ఇప్పటికే లాక్ డౌన్ రెండు సంవత్సరాలుగా విద్యార్థులు చదువులకు దూరం అయ్యారన్నారు. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న విద్యా వ్యవస్థ పై సంక్రాంతి హాలిడేస్ పొడిగింపు నిర్ణయం సరియైనది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సెలవుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కోరారు. సెలవుల ప్రకటనను ట్రస్మా రాష్ట్ర సంఘం ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నామని ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదుల మధుసుధన్. కోశాధికారి ఐ.వి రమణా రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed