- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్లూరు లో ఘరానా మోసం...మహిళా సంఘాల 50 లక్షలు స్వాహా...
దిశ, కోటగిరి : నలబై మహిళా సంఘాలకు సంబంధించిన సుమారు 50 లక్షల రూపాయల సొమ్ము స్వాహా చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా సంఘాల సభ్యులు తెలిపిన కథనం ప్రకారం ఓ బ్యాంకు సంబంధించిన సిఎస్సి నిర్వకురాలు సంధ్య గ్రామంలోని ఖాతా దారులకి అవసరమయ్యె డబ్బులను వారి ఖాత లోనుండి తీసి ఇవ్వడం అలాగే వారి ఖాతలో జమా చేయడం వంటి లావాదేవీలు చేస్తుండేది. నమ్మకస్తురాలుగా ఉండడంతో నమ్మినా డ్వాక్రా సంఘాల మహిళలు వారు తీసుకున్న రుణాలకు సంబంధించి కిస్తులను ,అలాగే పొదుపును సిఎస్సి నిర్వాహకురాలు వద్ద జమా చేసేవారు.
గత తొమ్మిది నెలలుగా సదరు సిఎస్సి సెంటర్ నిర్వహకురాలు సుమారుగా 40 సంఘాల వారి నుంచి సుమారు 50 లక్షల రూపాయలను సంఘాల ఖాతలో కాకుండా వారి బంధువుల ఖాతా లోకి పంపింది. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న లోన్ పూర్తయిందని కొత్త లోన్ కావాలని సదరు ఐకేపీ సిబ్బంది అడుగగా ఇంకా మీ లోన్ పూర్తి కాలేదు అని చెప్పడంతో ఆందోళన గురైన మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు కి వెళ్లి ఆరా తీయగా ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో మహిళలు పెద్ద ఎత్తున బ్యాంక్ వద్దకు చేరుకొని ఆందోళన దిగారు.