ఆర్మూర్ ఏసీపీగా గట్టు బస్వారెడ్డి బాధ్యతల స్వీకరణ...

by Kalyani |
ఆర్మూర్ ఏసీపీగా గట్టు బస్వారెడ్డి బాధ్యతల స్వీకరణ...
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయ ఏసీపీగా గట్టు బస్వారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఖమ్మం రూరల్ పోలీస్ అసిస్టెంట్ పోలీస్ కార్యాలయ ఏసీపీ గా విధులు నిర్వహించిన గట్టు బస్వారెడ్డి బదిలీపై వచ్చి సోమవారం ఆర్మూర్ ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆర్మూర్ ఏసీపీగా పనిచేసిన జగదీష్ చందర్ సిద్దిపేట సీసీఎస్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఆర్మూర్ ఏసీపీ గట్టు బస్వా రెడ్డి మాట్లాడుతూ… మొదట ఆర్మూర్ డివిజన్ ప్రాంత ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

సుమారు 12 సంవత్సరాల క్రితం ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలోనే పోలీస్ శాఖలో విధులు నిర్వహించి ఆర్మూర్ ప్రాంత ప్రజలకు సేవలందించినట్లు గుర్తు చేశారు. గతంలో ఆర్మూర్ ప్రాంతంలో కమ్మర్పల్లి మండలం మానాల లో జరిగిన ఎన్ కౌంటర్లో ఎస్సైగా బాధ్యతలు నిర్వహించే సమయంలోనే పాల్గొన్న అనుభవం తనకు ఉందన్నారు. పోలీస్ శాఖ ఎవరికీ చుట్టం కాదని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందన్నారు. నేరస్తులు ఎవరైనా చట్టానికి చుట్టాలు కారని, చట్టం తన పని తాను చేసుకుంటుందని, ఎంతటి వారైనా ఉపేక్షించేది ఉండదన్నారు. ఆక్ట్ ప్రకారం నేరస్తులకు శిక్షలు పడతాయని చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆర్మూర్ నూతన ఏసీపీ గట్టు బస్వారెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed