నందిపేటలో బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనం..

by Sumithra |
నందిపేటలో బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనం..
X

దిశ, నందిపేట్ : నందిపేట మండల పరిధిలో మున్నూరుకాపు సంఘంలో ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు మండల అధ్యక్షులు, ఆడపడుచులు అందరూ వచ్చే ఆత్మీయ సమ్మేళనం సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని కొనియాడారు. సీఎం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, ఆకుల లలిత, కోటపాటి నరసింహారావు, ఎమ్మెల్యే పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సభ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సభకు వచ్చిన ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ని గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని జీవరెడ్డి తెలియజేశారు.

Advertisement

Next Story