- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎలక్ట్రానిక్ తూకాలతో మోసం.. కొత్తూరు కొనుగోలు కేంద్రంలో రైతుల నిరసన
దిశ, నందిపేట్: అకాల వర్షాలతో రైతులు వరి వంగిపోయిందని, ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయిందని, కల్లాలలో, తూకాల వద్ద మొలకలు వచ్చాయని రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు. రైతుల కష్టాలతో ఉంటే.. కొనుగోలు కేంద్రాల వద్ద సొసైటీలు దోపిడీ మాత్రం ఆపడం లేదు. సాధారణంగా తేమ శాతం ఉన్న ధాన్యానికి రెండు కిలోల తరుగు ప్రతి ఏట జరిగే దోపిడీ. ఈసారి తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని ప్రభుత్వం చెబుతుండగా దానిని తీసుకునే విషయంలో సొసైటీలు, మిల్లర్లు కొర్రీలు పెడుతున్న విషయం తెలిసింది. సాధారణ తూకాలతో రైతులను మోసం చేస్తున్నారని గతంలో సొసైటీలకు ఎలక్ట్రానిక్ తూకాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే వాటితోనూ సొసైటీలలో దోపిడి కొనసాగుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం బజార్ కొత్తూరు గ్రామంలో ఎలక్ట్రానిక్ ట్రూకాలర్ ద్వారా జరిగిన మోసాన్ని బుధవారం రైతులు బట్టబయలు చేశారు.
చీం రాజ్ పల్లి సొసైటీ పరిధిలోని బజార్ కొత్తూరు గ్రామంలో కొనుగోలు కేంద్రం తూకంలో బస్తాకు ఐదు కిలోల తేడా ఉండడానికి గుర్తించి సొసైటీ నిర్వాహకులను కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిలదీశారు. ఇప్పటివరకు లారీలకొద్ది ధాన్యాన్ని కొనుగోలు చేశారని అప్పుడు జరిగిన తూకంలో ఒక్కో రైతు 5 కిలోల వరకు నష్టపోయాడని వాపోయారు. అది కాకుండా తరుగు పేరిట రెండు కిలోలు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బజార్ కొత్తూరులో జరిగిన కొనుగోలు గోల్‌మాల్ పై విచారణ జరిపి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తల్వేద ఇప్పుడు బజార్ కొత్తూరు గ్రామంలో రైతుల మోసం చేస్తున్న సొసైటీ నిర్వాహకులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.