- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడిరోడ్డుపై బీభత్సం సృష్టించిన ఫార్చునర్ కారు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రాతినిథ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గంలో కమలాపూర్- నాగపూర్ గేటు మధ్య దుబ్బ ప్రాంతంలో ఒక వీఐపీ కారు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం ఫార్చునర్ కార్ ఓవర్ స్పీడ్ తో విద్యుత్ స్తంభాన్ని, చెట్టును ఢీ కొట్టింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఇందుకు కారణమని తెలిసింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో, కరెంటు పోల్ రోడ్డు మీద పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కారు అనంతరం పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఆ సమయంలో రోడ్డుపై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు ఫార్చునర్ కారును అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఆ కారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ లీడర్ ది కావడంతో ఉన్న ఫలంగా నెంబర్ ప్లేటును కూడా తొలగించారు. ఘటనా స్థలంలో ఎవరూ ఫొటోలు, వీడియో తీయకుండా బీఆర్ఎస్ బడా నేత అనుచరులు దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఫామ్ హౌస్ లో విందు ముగించుకొని వస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై పోలీసులను సంప్రదిస్తే తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పేర్కొనడం గమనార్హం.