MLA Pocharam : నిజాంసాగర్ ప్రాజెక్టుపై మాజీ సభాపతి దిశా నిర్దేశం

by Sridhar Babu |
MLA Pocharam : నిజాంసాగర్ ప్రాజెక్టుపై మాజీ సభాపతి దిశా నిర్దేశం
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టును గురువారం మాజీ సభాపతి, బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ వెళ్లే క్రమంలో నిజాంసాగర్ ప్రాజెక్టు పైకి వెళ్లి అధికారులతో ముచ్చటించారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో, పూర్తి సామర్ధ్యం, ప్రాజెక్టులో ఉన్న నిల్వ నీరు వంటి విషయాలపై అధికారులతో చర్చించారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాలోమాన్ సమాధానమిస్తూ ప్రస్తుతం ప్రాజెక్టులో 3.9 టీఎంసీలు నీరు నిల్వ ఉందని, బయట నుండి ఇన్ఫ్లో 400 క్యూసెక్కుల వచ్చి చేరుతుందని తెలిపారు. ప్రాజెక్టు రోడ్డుపై ఇసుక మట్టి చేరి ఉందని దానిని వెంటనే తొలగించాలన్నారు. అంతేకాకుండా ప్రాజెక్టు ఒక గేటు మురాయిస్తుందని, దానికి మరమ్మతులు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీటిపారుదల శాఖ అధికారులు ఏఈ శివ ప్రసాద్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed