ఆ భవనాలన్నీ బడా నేతలవే.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఆ భవనాలన్నీ బడా నేతలవే.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) హయాంలో జరిగిన అవినీతి గురించి దేశమంతా తెలుసని మంత్రి సీతక్క(Minister Seethakka) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) గురించి, ఆ నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి అందరికీ తెలుసని అన్నారు. బీఆర్ఎస్ తప్పిదాలు కనుమరుగు చేసేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీలో ఆక్రమణల వల్ల అందరికీ ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. గత ఐదేళ్లలోనే మూసీ(Musi River) పరివాహక ప్రాంతాల్లో ఎన్నో అక్రమ కట్టడాలు వెలిశాయని అన్నారు. రాజకీయ నాయకుల భవనాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

బడా నేతలు భవనాలు కట్టి.. ఆ భవనాలను పేదలకు అద్దెకు ఇచ్చారని ఆరోపించారు. అందుకే తాము సామాన్యులకు నష్టం కలుగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ కూల్చివేతల్లో ఇళ్లు కూల్పోయిన పేదలు అందరికీ స్థిర నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొందరు చెరువుల మధ్యలో భవనాలు నిర్మించారని అన్నారు. మిడ్‌మానేరు, మల్లన్నసాగర్‌లో ఎంత నిర్ధాక్షిణ్యంగా ఖాళీ చేయించారో అందరికీ గుర్తుంది అని తెలిపారు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్‌లు మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన ఎవరూ మర్చిపోరు అని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed