జల్సాలకు అలవాటు పడి చోరీలు..దొంగల ముఠా అరెస్ట్

by Aamani |
జల్సాలకు అలవాటు పడి చోరీలు..దొంగల ముఠా అరెస్ట్
X

దిశ,యాచారం : జల్సాలకు, మద్యపానం, ఇతర వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం యాచారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎసీపీ కెవిపి రాజు, గ్రీన్ ఫార్మా సిటీ సీఐ ఏ నరసింహారావు, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, వివరాలను వెల్లడించారు. తలకొండపల్లి మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన దుబ్బ హర్షవర్ధన్, (19) 29వ తేదీన వాహనాల తనిఖీలో పట్టు పడగా గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులు విచారించారు.

నంది వనపర్తి గ్రామానికి చెందిన ఎడ్ల రాజు, (29) మహమ్మద్ ఆమెర్, (22) మేడిపల్లి గ్రామానికి చెందిన బేత జంగయ్య, (32) జాల నాగరాజు, (24) ముఠాగా ఏర్పడ్డారు. దుబ్బ హర్షవర్ధన్, కు ద్విచక్ర వాహనాల చోరీలో అనుభవం ఉండడంతో అఫ్జల్ గంజ్, మహబూబ్ నగర్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, యాచారం మంచాల ప్రాంతాల్లో బస్టాండ్ రెస్టారెంట్లు ఇతర ప్రాంతాల్లో మాస్టర్ కి తయారు చేసి పార్కింగ్ చేసిన 23 ద్విచక్ర వాహనాలను దొంగలించారు. కొన్ని రైతులకు విక్రయించగా మరికొన్ని వాహనాలు తమ ఇంటి వద్ద దాచిపెట్టినట్లు ఒప్పుకోవడంతో దొంగలించిన మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకొని దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దొంగలను పట్టుకున్న ఎస్సై తేజం రెడ్డి, కానిస్టేబుళ్లు జె శ్రీను, హెచ్ సుందరయ్య, హాథిరామ్, నరేందర్, లకు డీసీపీ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు శంకర్ కుమార్, సత్యనారాయణ, బభ్య నాయక్, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed