Mehbooba Mufti: అడాల్ప్ హిట్లర్ తర్వాత ఆయనే అతిపెద్ద ఉగ్రవాది.. మెహబూబా ముఫ్తీ

by vinod kumar |
Mehbooba Mufti: అడాల్ప్ హిట్లర్ తర్వాత ఆయనే అతిపెద్ద ఉగ్రవాది.. మెహబూబా ముఫ్తీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. అడాల్ఫ్‌ హిట్లర్‌ తర్వాత నెతన్యాహునే అతిపెద్ద ఉగ్రవాది అని అభివర్ణించారు. సోమవారం ఆమె జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజలను చంపడానికి హిట్లర్ గ్యాస్ చాంబర్‌లను ఏర్పాటు చేస్తే.. నెతన్యాహు మాత్రం పాలస్తీనా, లెబనాన్‌లనే గ్యాస్ చాంబర్లుగా మార్చారన్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ నెతన్యాహుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. పాలస్తీనాలో వేల మందిని చంపారని, ఇప్పుడు లెబనాన్‌లోనూ అదే తరహా పరిస్థితులను సృష్టిస్తున్నారని తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. మహత్మాగాంధీ కాలం నుంచి పాలస్తీనాకు తాము అండగా ఉన్నామని గుర్తు చేశారు. హత్యకు గురైన హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అమరవీరుడుగా అభివర్ణిస్తూ ముఫ్తీ ట్వీట్ చేయగా దానిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దీనిపై కూడా ఆమె తాజాగా స్పందించారు. ‘పాలస్తీనా ప్రజల కోసం నస్రల్లా చేసిన సుదీర్ఘ పోరాటం గురించి బీజేపీకి తెలియదని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story