మనిషి రక్తానికి రుచి మరిగిన చిరుత.. ఇళ్ల నుండి బయటికి రాని జనం

by M.Rajitha |
మనిషి రక్తానికి రుచి మరిగిన చిరుత.. ఇళ్ల నుండి బయటికి రాని జనం
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్(Rajastan) లో చిరుత పులులు ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గడిచిన 11 రోజుల్లో ఏడుగురు చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు కారణం. చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీ అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వరుసగా చిరుత దాడి చేసి ప్రాణాలు తీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావలంటేనే భయంతో వణుకుతున్నారు. అటవీ ప్రాంతానికి దగ్గరలో గల అన్ని గ్రామాల్లో ఇప్పటికే పాఠశాలలు మూతపడ్డాయి. సాయంత్రం తర్వాత ప్రజలు ఇళ్ల నుండి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఉదయ్ పూర్లో ఓ గుడిలో నిద్రిస్తున్న పూజారిపై చిరుత దాడి చేసి చంపి తిన్న ఘటన మరోసారి స్థానికుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఈ దాడులన్నీ ఒకే చిరుత చేస్తుందా? తోడేలు వంటివి ఏమైనా చేస్తున్నాయా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతుండగా.. అటవీ అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా, ఈ మరణాలన్నీ ఒకే చిరుత వలన జరిగాయని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం చిరుత కదలికలు ఉన్న అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

Advertisement

Next Story

Most Viewed