తిరుమలలో సిట్ దర్యాప్తు..నెయ్యి శాంపిల్స్ సేకరణ, పరీక్షలు

by srinivas |   ( Updated:2024-09-30 15:30:40.0  )
తిరుమలలో సిట్ దర్యాప్తు..నెయ్యి శాంపిల్స్ సేకరణ, పరీక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డు వివాదం(Tirumala Laddu Controversy)పై సిట్ దర్యాప్తు(SIT investigation) కొనసాగుతోంది. బృందాలుగా విడిపోయిన అధికారులు విచారణను ముమ్మరం చేశారు. రెండు రోజులుగా తిరుమల(Tirumala)లో విచారణ చేపట్టిన అధికారులు తాజాగా టీటీడీ (TTD) ఫ్లోర్‌మిల్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారు. రెండు కంపెనీలకు చెందిన నెయ్యి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు తరలించారు. ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, కేఎంఎఫ్ నందిని కంపెనీలు సరఫరా చేసిన నెయ్యి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌లో ప‌రీక్షలు చేయిస్తున్నారు. మరికాసేపట్లో లడ్డూ, అన్నప్రసాదాలు తయారు చేసే కార్మికులతోనూ త్రిపాఠి నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. వీలైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సిట్ భావిస్తోంది. ఈ మేరకు తిరుమలలో విచారణ జరుపుతోంది. తిరుమల విచారణ తర్వాత తమిళనాడులోని ఏఆర్ డెయిరీలోనూ ఓ బృందం విచారణ చేపట్టనుంది. నెయ్యి సరఫరాకు సంబంధించిన వివరాలపై ఆరా తీయనున్నారు.

Advertisement

Next Story