బ్యాంగిల్ స్టోర్ లో అగ్ని ప్రమాదం

by Sridhar Babu |
బ్యాంగిల్ స్టోర్ లో అగ్ని ప్రమాదం
X

దిశ, గాంధారి : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో టైలరింగ్, బ్యాంగిల్ స్టోర్ లో మంటలు చెలరేగిన సంఘటన గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా ఉన్న గంగ రాజయ్య షాపుల్లో కంటేశ్వర విజయ గత కొన్ని నెలలుగా టైలరింగ్ బ్యాంగిల్స్ స్టోర్ నడుపుతుంది. ఈ క్రమంలో ఉదయం టైలరింగ్ షాప్ బ్యాంగిల్ స్టోర్ నుండి పొగలు రావడంతో వెంటనే బ్యాంగిల్ స్టోర్ యజమానికి ఫోన్ చేసి తెలపగా షట్టర్ తాళం తీసి చూడగా మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్​కు ఫోన్ చేయగా ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చి పూర్తిగా ఆర్పీవేశారు. దాదాపు రూ.50 వేలకు పైగా నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed