- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీకర్ పోచారంకు రాఖీ కట్టి.. గోడు వెల్లబోసుకున్న మహిళా ఉపాధ్యాయులు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో భార్యభర్తలకు ( స్పౌజ్) కేసులలో ఓకే చోటకు బదిలీ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.. దానిని 19 జిల్లాలకు పరిమితం చేసింది. దీంతో మిగిలిన 13 జిల్లాలకు అవకాశం కల్పించలేదని.. దీని వల్ల భార్య ఓ దగ్గర, భర్త మరోదగ్గర విధులు నిర్వహించే దుస్థితి నెలకొనడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళా ఉపాధ్యాయినీలు ఆవేదన వ్యక్తం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మహిళా ఉపాధ్యాయులు ఆయనకు రాఖీ కట్టి.. తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భార్యాభర్తలిద్దరూ ఒక దగ్గర పని చేస్తేనే ఉత్పాదకత పెరుగుతుందని సీఎం కేసీఆర్ పలుమార్లు అసెంబ్లీ సాక్షిగా పేర్కొనడం జరిగిందన్నారు. జీవో నెంబర్ 317 అమల్లో భాగంగా భార్యాభర్తలను ఒకే దగ్గర ఉంచేలా చర్యలు తీసుకోమని సీఎం కేసీఆర్ సూచించారని, కానీ 19 జిల్లాల్లో భార్యాభర్తల బదిలీలకు అవకాశం ఇచ్చి.. 13 జిల్లాలను బ్లాక్‌లో ఉంచారని అందులో నిజామాబాద్ జిల్లా కూడా ఒకటి అని తెలిపారు. అవసరమైన ఖాళీలు అందుబాటులో ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లాను బ్లాక్‌లో ఉంచడం వల్ల తాము గత 7 నెలలుగా తీవ్ర మానసిక ,శారీరక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు.
కుటుంబాలకు దూరంగా ఇల్లు, పిల్లల బాగోగులు చూసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలకు దూరం కావడంతో బోధనపై సరైన దృష్టి సారించలేకపోతున్నామని, ప్రతిరోజు 100 నుండి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి విధులకు హాజరు కావాల్సి వస్తుందని వాపోయారు. అనారోగ్య కారణాల వల్ల విధులకు హాజరు కాలేక మహిళా ఉపాధ్యాయులు మెడికల్ లీవ్‌లు పెట్టుకునే పరిస్థితి నెలకొందని.. దయచేసి ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియజేసి మమ్మల్ని ఈ నరకకూపం నుండి బయటపడేయాలని మహిళా ఉపాధ్యాయులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని వేడుకున్నారు. స్పందించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తక్షణమే సీఎస్ సోమేశ్ కుమార్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలకు ఫోన్ కాల్ చేసి భార్యాభర్తల బదిలీల గురించిన సమస్య గురించి ఆరా తీశారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.