ఫతేపూర్ ఊర చెరువుకు గండి...

by Sumithra |
ఫతేపూర్ ఊర చెరువుకు గండి...
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో గల ఊర చెరువు పాత తూముకు ఆదివారం అర్ధరాత్రి గండి పడింది. గ్రామంలోని ఊర చెరువుకు గండి పడటంతో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, రైతులు చెరువు కట్ట పైన గల గండి వద్ద సహాయక చర్యలు చేపట్టారు. అయినా గండి పుడక పోవడంతో జేసీబీని పిలిపించి గండిని పూడ్చేందుకు సహాయక చర్యలు చేపట్టి ఊర చెరువుకు పడిన గండిని పూడ్చారు. ఈ కార్యక్రమంలో ఫతేపూర్ ఏరియా ఇరిగేషన్ శాఖ అధికారులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed