రైతులు అధైర్య పడవద్దు : ఎమ్మెల్యే

by Kalyani |
రైతులు అధైర్య పడవద్దు : ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్; రైతులు అధైర్య పడవద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… జిల్లాలో దాదాపు 52 వేల ధరణి అప్లికేషన్లు వచ్చాయని అందులో ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. కలెక్టర్ , జెసి , ఆర్డీవో గాని తొందరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, ఈరోజు ధరణి అప్లికేషన్లకు సంబంధించిన సమస్యలను గురించి మాట్లాడి పరిష్కరించడం జరిగిందని, కావున రైతులు ఆందోళన పడవద్దని దరఖాస్తులు పరిష్కరించిన కొద్ది ఇంకా వేలాది అప్లికేషన్లు వస్తూనే ఉన్నాయని సుదర్శన్ రెడ్డి తెలిపారు.

ధరణి వల్ల రైతులు తమ భూమి అమ్ముకోవడానికి గాని ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి గాని వీలు లేకుండా జరిగిందని, ఇలాంటి తప్పులు జరగకుండా రైతులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ తహసీల్దార్ ఆర్డీవోలు కలెక్టర్లు సమస్యలు పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో అధికారులు అద్భుతంగా సమస్యలు పరిష్కరించారాని, కొంత మేరకు అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని అందులో నిజామాబాదులో కొత్తగా వచ్చిన 846 అప్లికేషన్లు పాతవి కలిపి ఆర్డీఓ దగ్గరికి పంపిన అప్లికేషన్లు 1092 జాయింట్ కలెక్టర్ దగ్గరికి పంపినవి 1100 మొత్తం 2162 అప్లికేషన్లు పరిష్కరించడానికి పంపడం జరిగిందని, బోధనలో తహసీల్దార్ దగ్గర 330 ఆర్ డి ఓ దగ్గర 390 జెసి దగ్గర 256 మొత్తం 976 పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.

ఆర్మూర్లో తహసిల్దార్ దగ్గర 533 ఆర్డీవో దగ్గర 593 జెసి దగ్గర 345 ఉన్నాయని వీటిని అధికారులు తొందరగా పరిష్కరిస్తారని రైతులు అధైర్య పడవద్దని సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులకు పోస్టు ద్వారా పాసుబుక్కులు ఇంటికి వస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా నే సమస్యలు పరిష్కరించడంలో మొదటి స్థానంలో ఉంటుందని, సర్వేలన్నీ సక్రమంగా చూసి ఎవరి భూమిని వారికి పట్టా అచ్చే విధంగా ప్రభుత్వం చూస్తుందని రైతులకు ఇబ్బంది కాకుండా చూడడమే ప్రభుత్వం పని అని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హంధాన్ ,పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story