కేజీబీవీలో ఫేర్ వెల్ పార్టీకి డబ్బులు వసూళ్లు

by Sridhar Babu |
కేజీబీవీలో ఫేర్ వెల్  పార్టీకి డబ్బులు వసూళ్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పదవ తరగతి విద్యార్థులకు వచ్చే నెలలో పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో ఆ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం ఫేర్ వెల్ పార్టీ నిర్వహించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు వీడ్కోలు పలికేందుకు గాను నిర్వహించిన పార్టీకి ప్రభుత్వం సరఫరా చేసే సామాగ్రితోనే విందు ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే కేజీబీవీకి సరఫరా చేసే చికెన్ ద్వారానే చికెన్ బిర్యానీ వంటకానికి ఏర్పాట్లు చేశారు. కానీ పాఠశాలలో విద్యార్థినిల నుంచి ఫేర్ వెల్ పేరిట డబ్బుల వసూలు చేశారు.

నిజామాబాద్ సరిహద్దులోని పూర్వం వర్ని మండలంలోని ఓ కేజీబీవీలో పదవ తరగతి విద్యార్థినిలకు రూ.వెయ్యి చొప్పున వసూల్ చేశారు. అంతేగాకుండా 9,8,7,6 వ తరగతి విద్యార్థినిలను కూడా వదులకుండా ఒక్కో విద్యార్థినికి రూ.500 వరకు వసూల్ చేయడం గమనార్హం. అసలే పేద విద్యార్థులు కేజీబీవీలో చదువుతుంటే వారికి వీడ్కోలు పేరిట జూనియర్ విద్యార్థులను, సీనియర్ విద్యార్థులను

వదలకుండా వసూల్ చేయడం వివాదస్పదమైంది. కొంత మంది విద్యార్థినిలు తమను కలిసేందుకు వచ్చిన తల్లిదండ్రుల వద్ద పేర్ వెల్ పార్టీ కోసం డబ్బులు అడగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పేద విద్యార్థినిలు చదువుకునే పాఠశాలలో సీనియర్లకు వీడ్కోలు కార్యక్రమం పేరిట జూనియర్ల వద్ద లక్షకు పైచిలుకు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed