- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రతన్ టాటా కన్నుమూత.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: టాటా ఇండస్ట్రీస్ అధినేత, రతన్ టాటా(Ratan Tata) బుధవారం రాత్రి అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కన్నుమూశారు. రాత్రి 11.30 నిమిషాలకు కన్నుమూశారు. అధికారిక ధృవీకరణ అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అక్కడికి చేరుకొని రతన్ టాటాకు నివాళులు అర్పించారు. కాగా లక్షల మందికి ఉపాధి కల్పించిన మహోన్నత నేతకు నివాళిగా.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రతన్ టాటా.. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం ఏక్ నాథ్ షిండే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అలాగే ఆయన అభిమానులు సామన్య ప్రజల సందర్శనార్ధం ఉదయం 10.30 గంటలకు ముంబైలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్ లో ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుండగా.. సాయంత్రం సమయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను పూర్తి చేయనున్నారు. కాగా ఆయన మృతిపై యావత్ భారత దేశం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.